కాలినడకన.. మారుమూల పల్లెకు వెళ్లిన సీనియర్ సివిల్ జడ్జి

కాలినడకన.. మారుమూల పల్లెకు వెళ్లిన సీనియర్ సివిల్ జడ్జి

మంగ్లీ గ్రామాన్ని సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

గిరిజనులకు దోమతెరలు, మాస్కులు, ట్యాబ్లెట్లు అందజేత

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కంచ ప్రసాద్‌ శనివారం ఆదిలాబాద్‌ రూరల్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం మంగ్లీకి వెళ్లారు. గ్రామానికి వాహనాలు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడుభూముల్లో సాగు చేసుకుంటున్నా పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు జడ్జి దృష్టికి తీసుకెళ్లా రు. అనంతరం వారికి మాస్కులు, శానిటైజర్లు, దోమతెరలు, ట్యాబ్లెట్లు అందజేశారు. జడ్జి వెంట మండల వైద్యాధికారి రోజారాణి, డాక్టర్‌ జయశ్రీ ,హెల్త్ అసిస్టెంట్ ఈశ్వర్ రెడ్డి సూపర్‌ వైజర్ యశోద, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఉన్నారు.

గిరిజనులకు శానిటైజర్లు అందజేస్తున్న జడ్జి ప్రసాద్