7న పోలింగ్ బూత్ల అధ్యక్షులతో నడ్డా వర్చువల్ మీటింగ్

7న పోలింగ్ బూత్ల అధ్యక్షులతో నడ్డా వర్చువల్ మీటింగ్

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదనుపెడుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కొత్తగా బాధ్యతలు చేపట్టిన అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ పాలక్ లు జనవరి 5, 6, 7 తేదీల్లో తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో మకాం వేయనున్నారు. జనవరి 7 న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జీలతో వర్చువల్ గా సమావేశం కానున్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేసోంది. జేపీ నడ్డా వర్చువల్ కాన్ఫరెన్స్ కోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో డిజిటల్ స్క్రీన్ లు ఏర్పాటు చేయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 300 నుంచి 400 మంది బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.