సమ్మర్ అని ఐస్ క్రీం తింటున్నారా? ఇలాంటి వారు కూడా ఉంటారు.. జాగ్రత్త

సమ్మర్ అని ఐస్ క్రీం తింటున్నారా? ఇలాంటి వారు కూడా ఉంటారు.. జాగ్రత్త

సమ్మర్ వస్తుందంటే చాలు వేడి నుంచి ఉపశమనం కోసం ఐస్ క్రీం తింటుంటారు. ఈ సీజన్ లో ఐస్ క్రీమ్ బిజినెస్ కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇదే అదునుగా తీసుకొని కొందమంది కేటుగాళ్లు నకిలీ ఐస్ క్రీం తయారీ దందా నడిపిస్తున్నారు. ఆదివారం (మార్చి 3)న  భవనగిరి టౌన్ లో స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా హెల్తీ డైరీ టెక్ ఐస్ క్రీమ్ అనే పేరుతో తయారు చేస్తున్న ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని గుర్తించారు.  ట్రేడ్, ఫుడ్ లైసెన్స్ లేకుండా కల్తీ పదార్థాలతో ఐస్ క్రీమ్ లు అక్కడే  తయారు చేస్తు్న్నారు. మ్యానిఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ తేదీలు కూడా లేవు. 

 హెల్తీ  డైరీ టెక్ ఐస్ క్రీమ్ కంపెనీ యజమాని నరేందర్ పరారీలో ఉన్నాడు. ఆశిష్ కుష్వ అనే వ్యక్తిని ఎస్ఒటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెల్తీ డైరీ టెక్ ఐస్ క్రీమ్ పేరు పై గల బిగ్ కోన్స్ 80, మిని సైజ్ కోన్స్ 180, 240 చాకో బార్స్, 200 వెనెలా ఐస్ క్రీమ్స్, ఐదు కేజీల లూస్ ఐస్ క్రీమ్స్ ఇతర ఐస్ క్రీమ్స్ తయారీ పదార్థాలు, రసాయనాలు స్వాదీనం చేసుకున్నారు. కల్తీ  ఐస్ క్రీమ్స్ తో పాటు నిందితుడిని భువనగిరి టౌన్ పిఎస్ కి అప్పగించారు.