తమిళనాడు సీఎం విజయ్ ట్రాఫిక్ ఐడియా అదిరింది. సీఎం కాన్వాయ్ వస్తుంది అంటే చాలు.. ముందు 5 నుంచి 10 నిమిషాలు ట్రాఫిక్ బంద్ చేస్తారు.. వాహనాలు అన్నీ ఆపేస్తారు. సీఎం కాన్వాయ్ కోసం గ్రీన్ ఛానెల్ కింద రోడ్లు అన్నీ ఖాళీగా ఉంటాయి. సీఎం ఇల్లు లేదా ఆఫీసు నుంచి రోడ్డెక్కితే చాలు.. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఆయా సిటీలు, నగరాల్లో ఇదే పరిస్థితి.. ఇందుకు తమిళనాడు రాష్ట్రం ఏం మినహాయింపు కాదు.
కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నుంచి ఆఫీసుకు.. లేదా ఇతర పనులపై బయటకు వచ్చినప్పుడు రోడ్లపై ట్రాఫిక్ బంద్ చేయటం.. వాహనాలను ఎక్కడికక్కడ ఆపటం వంటి చర్యలకు బంద్ పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా చేస్తే సీఎం కూడా గంటలు గంటలు ట్రాఫిక్ లో ఉండాలి కదా.. అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తుంది కదా అనే డౌట్ రావొచ్చు. దీనికి చెన్నై సిటీ ట్రాఫిక్ పోలీసులతో చర్చించి ఓ సరికొత్త ఐడియా రూపొందించారు. నిన్నటికి నిన్న ఈ విధానాన్ని అమలు చేశారు కూడా..
చెన్నై సిటీ అంటే పెద్దదే కదా.. కనీసం రెండు నుంచి మూడు లైన్ల దారి ఉంటుంది. సీఎం కాన్వాయ్ ఒక లైన్ లో వెళుతుంది.. మిగతా లైన్లలో సాధారణ వాహనాలు వెళుతూనే ఉంటాయి. అంటే రోడ్డు మొత్తాన్ని క్లోజ్ చేయరు.. ఓ లైన్ వరకు మాత్రమే క్లీయర్ చేసి.. ఆ లైన్ లో ట్రాఫిక్ జాం కాకుండా సీఎం వెళ్లిపోతారు. మిగతా లైన్ లో సాధారణ వాహనాలు వెళుతూనే ఉంటాయి.
చెన్నై సిటీలో నిన్నటి రోజున ఈ ఐడియాను అమలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. మంచి రిజల్ట్ వచ్చిందంట. హైదరాబాద్ సిటీలో అప్పుడప్పుడు.. అక్కడక్కడ చూస్తూ ఉంటాం.. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ సమయాల్లో.. ట్రాఫిక్ రద్దీ లేని ఆపోజిట్ రోడ్డులోని సగ భాగాన్ని క్లోజ్ చేసి.. ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటారు. ఇలాంటి తరహాలోనే రోడ్డుపైన ఒక లైన్ లో మాత్రమే సీఎం కాన్వాయ్ వెళుతుంటే.. మిగతా లైన్లలో సాధారణ వాహనాలు వెళుతూ ఉంటాయి. దీని వల్ల ట్రాఫిక్ మొత్తాన్ని ఆపాల్సిన పని లేకుండా ఉంటుంది.
దీనికితోడు.. చెన్నై సిటీలో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని.. సీఎం విజయ్.. సెక్రటేరియట్ లేదా ఇతర పనుల కోసం ఉదయం ఎర్లీగానే బయలుదేరుతున్నారంట..
