
టాలీవుడ్‌లో దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఆసక్తికర అప్‌డేట్‌లు, సరికొత్త సినీ కబుర్లతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు మేకర్స్. అలాగే ఆకట్టుకునే పోస్టర్లతో విషెస్ చెబుతూ వెలుగులను పంచారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఈ దివ్వెల పండుగకు అందించిన స్పెషల్ ట్రీట్స్ చూద్దాం.
సంక్రాంతికి వస్తున్నారు
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి దీపావళి కానుకగా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ టైటిల్‌ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేష్ లుంగీ కట్టుకుని, తుపాకీ పట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఓ వైపు ఐశ్వర్య రాజేష్, మరోవైపు మీనాక్షి చౌదరి మోడర్న్ గెటప్‌లో ఆకట్టుకున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టీజర్ ట్రీట్
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నవంబర్ 9న టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు చరణ్ కొత్త పోస్టర్‌తో ప్రకటించారు. రైల్వే ట్రాక్‌పై కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని లుంగీ, బనియన్‌తో పక్కా మాస్ లుక్‌లో కూర్చున్న రామ్ చరణ్ స్టిల్ ఇంప్రెస్ చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
ధనుష్, నాగార్జున లీడ్‌రోల్స్‌లో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘కుబేర’ టీజర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. దివాళీ విషెస్ చెబుతూ.. టాకీ పార్ట్ పూర్తయిందని, నవంబర్ 15న టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.
రిలీజ్‌కు రెడీ
నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో తెలుగు, తమిళ బై లింగ్విల్‌గా రూపొందిన చిత్రం ‘లెవెన్’. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 22న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక కీలక పాత్రలు పోషించారు.
జితేందర్ రెడ్డి పోరాటం
రాకేష్ వర్రే లీడ్ రోల్‌లో విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. దీపావళి సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. 1980 నేపథ్యంలో జగిత్యాల చుట్టుపక్కల జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని రూపొందించారు. కాలేజీ రోజుల నుంచి ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం, ధర్మం కోసం జితేందర్ రెడ్డి చేసిన పోరాటమే ఈ సినిమా కాన్సెప్ట్ అని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. నవంబర్ 8న సినిమా విడుదల కానుంది.
బ్లాస్టింగ్ పోస్టర్స్
బ్లాస్టింగ్ పోస్టర్లతో ఇండస్ట్రీలో ఈ దీపావళి కళకళలాడింది. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ రూపొందిస్తున్న ‘పుష్ప2’ నుంచి సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భార్యాభర్తలుగా నటిస్తున్న వీరి జోడీ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుంది.
నాని హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘హిట్ 3’ నుంచి విడుదలైన పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. యాక్షన్ మోడ్‌లో ఉన్న నాని లుక్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. శైలేష్ కొలను రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా మే 1న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’.
వెంకీ కుడుముల రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నితిన్ యాక్షన్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. దీపావళి విషెస్‌తో విడుదలైన ఈ మూవీ పోస్టర్‌లో విశ్వక్ సేన్ బస్సులో కూర్చొని ట్రెడిషనల్ గెటప్‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు. నవంబర్ 22న సినిమాను విడుదల చేయనున్నారు.
బ్రహ్మానందం పెద్ద కొడుకు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి దీపావళి కానుకగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ట్రెడిషనల్ అవతార్‌లో కనిపిస్తున్న రాజా గౌతమ్ లుక్ ఆకట్టుకుంది. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది.
తమన్నా లీడ్ రోల్‌లో అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘ఓదెల2’. సంపత్ నంది కథను అందిస్తూ.. మధు క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న వశిష్ట ఎన్ సింహ క్యారెక్టర్‌ని తిరుపతిగా పరిచయం చేశారు. ఈ డివైన్ యాక్షన్ థ్రిల్లర్‌లో వశిష్ట ఒక భయంకరమైన రాక్షస పాత్రలో కనిపించబోతున్నట్టు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.