మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్ అని చాలా సందర్భాల్లో విన్నాం. సమ్మర్లో బీర్ల అమ్మకాలు పెరగటం, న్యూ ఇయర్ వేడుకల సమయంలో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున పెరగటం ఏటా వింటూనే ఉంటాం. తెలంగాణ విషయానికి వస్తే మద్యం అమ్మకాల్లో టాప్ లిస్ట్ లో ఉంటుంది. అయితే, ఓనం సందర్బంగా కేరళలో జరిగిన లిక్కర్ సేల్స్ చూస్తుంటే తెలంగాణతో పోటీ పడేలా ఉంది.
ఓనం సందర్బంగా కేరళలో మందుబాబులు రెచ్చిపోయారు.. సెప్టెంబర్ 6 నుండి 17వరకు 818.21 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు. గత సంవత్సరం ఓనం సీజన్లో 809.25 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగగా ఈ ఏడాది అమ్మకాలు అంతకు మించి నమోదయ్యాయి.
ALSO READ | ఎంత మానవత్వం : మధ్యాహ్న భోజనానికి ఉచితంగా కూరగాయలు
అయితే,.. ఓనం పండుగలో భాగమైన ఉత్రదం కి ముందు తొమ్మిది రోజుల వ్యవధిలో రూ.701 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా.. ఉత్రదం ఒక్కరోజునే 124కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.