ఒక్కసారి హద్దులు నిర్ధారిస్తే భూగోళం ఉన్నంత వరకు మార్చడానికి వీల్లేదు

ఒక్కసారి హద్దులు నిర్ధారిస్తే భూగోళం ఉన్నంత వరకు మార్చడానికి వీల్లేదు

సమగ్ర భూసర్వేకు దేశంలో చాలా కంపెనీలు, ప్రైవేట్​ ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నాయని, తలా ఓ జిల్లా ఇస్తే తొందరగా చేసి పెడతామంటున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.  సర్వే చేసిన తర్వాత పొజిషన్​ మీద ఎక్కువ ఉందో.. తక్కువ ఉందో తేలిపోతుందని, ఆ తర్వాత పట్టాలో ఎక్కువ, తక్కువ ఉంటే మార్చుకోవచ్చన్నారు. సమగ్ర భూసర్వేతోనే 99 శాతం సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. సమగ్ర సర్వేలో అక్షాంశాలు, రేఖాంశాల వారీగా కోఆర్డినేట్స్​ ఇస్తారని, ఒక్కసారి హద్దులు నిర్ధారిస్తే భూగోళం ఉన్నంత వరకు మార్చడానికి వీలుండదన్నారు. వీలైనంత తొందరగా సర్వే జరుగుతదని, ప్రతి సర్వే నంబర్‌కు కో ఆర్డినేట్స్‌ ఇస్తామని వెల్లడించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామన్నారు. అసైన్డ్​ ల్యాండ్​ విషయంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు పార్టీలకతీతంగా దళిత, గిరిజన నేతలు, ఎమ్మెల్యేలను పిలిచి సమావేశం పెట్టాలని సూచించానని ఆయన వివరించారు.