అమిత్​షా సభకు లక్షన్నరకు పైగా జనం

అమిత్​షా సభకు లక్షన్నరకు పైగా జనం
  • సభ సక్సెస్.. బీజేపీలో ఫుల్ జోష్
     

భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బీజేపీ లీడర్లు, కార్యకార్తలు సుమారు లక్షన్నర దాకా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన మీటింగ్ నాలుగున్నర గంటల వరకు సాగింది. కేంద్ర హోం మంత్రి పర్యటన కావడంతో నిర్మల్ పట్టణాన్ని ఢిల్లీ ఎస్పీజీ గుప్పిట్లోకి తీసుకుంది. అడుగడుగునా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిర్మల్ పట్టణమంతా కాషాయ జెండాలతో రెపరెపలాడింది. వేలాది వాహనాల రాకతో గంటల తరబడి ట్రాఫిక్​ జాం అయింది. 

కేంద్ర హోం మంత్రి అమిత్​షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, మాజీ మంత్రి ఈటల రాజేందర్​ప్రసంగించినప్పుడు కార్యకర్తలు కేరింతలు, చప్పట్లతో హోరెత్తించారు. ‘భారత్​మాతా కీ జై’ నినాదాలు మారుమోగాయి. సభ సక్సెస్ కావడంతో బీజేపీ నేతల్లో జోష్ పెరిగింది.

    మధ్యాహ్నం 2:45: నిర్మల్​లోని క్రషర్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు అమిత్​షా హెలికాప్టర్ చేరుకుంది. అక్కడ షాకు జిల్లా కలెక్టర్ ముషారఫ్​అలీ, ఎస్పీ        ప్రవీణ్​కుమార్ స్వాగతం పలికారు.
    2:55: ప్రత్యేక కాన్వాయ్ ద్వారా సభా స్థలికి చేరుకున్నారు. 3 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్  చిత్రపటం వద్ద నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
    3:15: సభా స్థలిపై కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేశారు. కొద్దిసేపు సన్మాన కార్యక్రమం జరిగింది.
    3:47: అమిత్​షా ప్రసంగం ప్రారంభమైంది. 25 నిమిషాలపాటు సాగింది
    4:05: హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాందేడ్​ తిరిగిపయనమయ్యారు.