చిన్నారులకు వికటించిన వ్యాక్సిన్ : ఒకరి మృతి, నీలోఫర్ లో ఉద్రిక్తత

చిన్నారులకు వికటించిన వ్యాక్సిన్ : ఒకరి మృతి, నీలోఫర్ లో ఉద్రిక్తత
  • నాంపల్లి హెల్త్ సెంటర్ లో 90మందికి వ్యాక్సినేషన్
  • నీలోఫర్ ఐసీయూలో 15మందికి చికిత్స
  • ఒకరి మృతి, ముగ్గురికి సీరియస్
  • బాధితుల ఆందోళన, ఉద్రిక్తత
  • పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు

హైదరాబాద్ : నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో బుధవారం వ్యాక్సినేషన్ తీసుకున్న పిల్లలు అస్వస్థత పాలయ్యారు. నిన్న ఇక్కడి ఆరోగ్య కేంద్రంలో 90 మంది చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇచ్చారు ఆరోగ్య శాఖ సిబ్బంది. వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే నొప్పికి సంబంధించి పిల్లలకు తప్పుడు టాబ్లెట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ కారణంగా చిన్నారులు తీవ్రంగా అస్వస్థత పాలైనట్టు బాధిత తల్లిదండ్రులు అంటున్నారు. బాధిత చిన్నారులలో 15 మందికి నీలోఫర్ ఐసీయూకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో 18 నెలల బాబు చనిపోయాడు. మరో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంత నిర్లక్ష్యంగా మందులు ఇచ్చి.. పిల్లల ప్రాణాలతో ఆడుకుంటారా అంటూ నీలోఫర్ దగ్గర బాధితులు ఆందోళన చేశారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు పోలీసులను పెద్దసంఖ్యలో మోహరించారు.