రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రిపరేషన్

రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రిపరేషన్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రిపరేషన్​ను ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అధ్యక్షతన ఒకరోజు వర్క్ షాప్​ నిర్వహించారు. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాల, అసెంబ్లీల అధికారులు, పుదుచ్చేరి, ఢిల్లీ ప్రాంతాల ఆఫీసర్లు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, ఏఆర్వోలు ఉపేందర్ రెడ్డి, ప్రసన్న కుమారి(రాష్ట్రపతి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు), తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్​(సీఈవో) నుంచి డిప్యూటీ సీఈవో సత్యవేణి హాజరయ్యారు. ఈ మీటింగ్ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ, బ్యాలెట్ బ్యాక్స్ లు, ప్రొసిడింగ్స్, ఇతర అంశాలపై వర్క్ షాపులో చర్చించారు.