బీజాపూర్ హైవేపై మరో ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ఒకరు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు..

బీజాపూర్ హైవేపై మరో ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ఒకరు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు..

బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ( నవంబర్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని కనకమామిడి గేటు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

కాశతగాత్రులను 108 వాహనంలో ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజాపూర్ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 

ఈ నెలలో జరిగిన టిప్పర్ బస్సు ప్రమాదం మరువక ముందే.. గురువారం ( నవంబర్ 20 ) లారీ ప్రమాదం జరగడం, ఇవాళ కారు ప్రమాదం జరగడంతో ఈ రోడ్డుపై వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నామం అంటున్నారు స్థానికులు.రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసి ప్రమాదాల నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు స్థానికులు.