
- కాలు లేదని ఖాళీగా ఉంటనా.. పొలం పనుల్లో బిజీ బిజీ
- చేతి కర్రతో నడుస్తూ.. పారతో ఒడ్లు చెక్కుతున్న రైతు
న్యూఢిల్లీ: శరీరంలో అవయవాలన్నీ బాగున్నా ఏదో ఓ వంకతో పనిని ఎగ్గొట్టే వాళ్లు ఎంతోమంది.. అదేమంటే దానికి ఎన్నో సాకులు కూడా చెబుతారు. ఓ రైతు మాత్రం ఒంటి కాలుతోనే పొలంలో ఒడ్లు చెక్కేస్తున్నాడు. కాలు లేదని ఆలోచన పక్కన పెట్టి కర్ర సాయంతో పొలం పనులు చేసుకుపోతున్నడు.
బురదలో కర్ర సాయంతో నడవడమే కష్టమనుకుంటే వంగి ఒడ్లు చెక్కుతున్నడు. వంకలు చెప్పకుండా పని చేసుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కు అర్థం చెబుతున్నాడు. ఇదంతా చూసిన వాళ్లెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ఐఎఫ్‌ఎస్ అధికారి సుధా రామెన్ ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘మనలో చాలా మంది పని తప్పించుకునేందుకు వంకలు వెతుకుతుంటాం. కానీ ఇక్కడో హీరో ఉన్నారు. మారుమూల ప్రాంతంలో. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇతని నుంచి చాలా నేర్చుకోవచ్చు’ అని ఆమె ట్వీట్ చేశారు. అయితే అందులోని వ్యక్తి పేరేంటి, ఎక్కడుంటారు లాంటి విషయాలేం వెల్లడించలేదు. మరో ఐఎఫ్‌ఎస్ అధికారి మధుమిత.. ‘ఈ వీడియోకు ఏ పదాలూ న్యాయం చేయలేవు’ అని ట్వీట్ చేశారు.
In the world when most of us try to find an excuse, here is a hero who works silently in a distant remote place. Lots to learn from him. Respects ?pic.twitter.com/FRRDFv0Ftz
— Sudha Ramen IFS ?? (@SudhaRamenIFS) September 17, 2020
For More News..