పేద దేశాలకు ఇప్పట్లో వ్యాక్సిన్ లేనట్లే

పేద దేశాలకు ఇప్పట్లో వ్యాక్సిన్ లేనట్లే

న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో ఐదో వంతు మందికి మరో ఏడాదిన్నర దాకా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. వచ్చే ఏడాదికి సరిపడా వ్యాక్సిన్ డోసులను ధనిక దేశాలు రిజర్వ్ చేసుకుంటున్న నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు పేద దేశాలకు ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ లేవని ఓ స్టడీ వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి పలు దేశాల్లో వ్యాక్సిన్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్ ప్రారంభమయ్యాయి.

ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌‌ డోసుల్లో సగానికి పైగా డోసులను గ్లోబల్ పాపులేషన్‌లో 14 శాతం మాత్రమే ఉండే ధనిక దేశాలు ముందస్తు ఆర్డర్ చేసుకున్నారని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫండ్ పేర్కొంది. వ్యాక్సిన్ రేసులో పేద దేశాలు వెనుకబడ్డాయని తెలిపింది. ఒకవేళ వ్యాక్సిన్ తయారీదారులు తమ ప్రొడక్షన్‌‌ను భారీగా పెంచినా.. ప్రపంచ జనాభాలో ఐదో వంతు ప్రజలకు 2022 వరకు వ్యాక్సిన్ అందే అవకాశాలు లేవని స్పష్టం చేసింది.