పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి

పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి
  • ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

హైదరాబాద్: రాకెట్ సైన్స్ మనుగడలో ఉన్న ఈకాలంలో కూడా పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. సోమజిగూడ ప్రెస్ క్లబ్‌లో బిసి కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చైతన్యానికి మారుపేరు తెలంగాణ, ఈ మట్టికి స్ఫూర్తి ఎక్కువ, ఉపాసమైనా ఉంటది కానీ, ఆత్మగౌరవాన్ని విడవదని పేర్కొన్నారు. చిన్న కులాల్లో పుట్టామనే ఆత్మన్యూనత భావాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యతతోనే మనకు రావాల్సిన హక్కులను సాధించాలి,  వైరుధ్యాలు లేని సమాజం ఉండదు,  వైరుధ్యాలు మిత్ర వైరుధ్యాలుగానే ఉండాలని మంత్రి ఈటెల సూచించారు.

For More News..

ఇంజనీరింగ్ స్టూడెంట్లకు క్లాసుల్లేవ్.. ఓన్లీ ల్యాబులే

పీఆర్సీ రిపోర్ట్​ను లీక్​ చేసినోళ్లు దొరికిన్రు

రాహుల్ వంట.. అదిరేనంట.. యూట్యూబ్ లో వీడియో వైరల్