పాజిటివ్ వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒమిక్రాన్

పాజిటివ్ వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒమిక్రాన్

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వస్తున్న ప్రయాణీకుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒమిక్రాన్ సోకినట్లు పరీక్షల్లో తేలుతోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల శాంపిల్స్ ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ.. ఐజీఐబీ కి పంపుతున్నారు. అక్కడి ల్యాబ్ లో నిత్యం 15 నుంచి 20 శాంపిల్స్ కు సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నారు. వాటిలో 20శాతం శాంపిల్స్ లో ఒమిక్రాన్ వేరియెంట్ ను గుర్తిస్తున్నట్లు ఐజీఐబీ సీనియర్ సైంటిస్ట్ చెప్పారు. 
మరోవైపు ఒమిక్రాన్ బాధితుల్లో చాలా మంది రెండు డోసుల టీకా ఉన్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్ లో 34 మంది బాధితులు ఒమిక్రాన్ చికిత్స పొందుతుండగా.. వారిలో 33 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారే ఉన్నారు. పేషెంట్లలో ఇద్దరు విదేశీ ప్రయాణీకులు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరిన 34 ఒమిక్రాన్ బాధఇతుల్లో ఐదుగురు యూరప్, ఆఫ్రికా దేశస్థులు ఉన్నారు. 

మరిన్ని వార్తల కోసం

తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు !

తెలంగాణ గ్రామంలో 10 రోజుల లాక్ డౌన్

దేశంలో 60 శాతం మందికి పూర్తయిన వ్యాక్సినేషన్