ఒకే దేశం.. ఒకే ఎన్నికలపై 2018లో లా కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే..!

ఒకే దేశం.. ఒకే ఎన్నికలపై 2018లో లా కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే..!

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి.. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన మోదీ ప్రభుత్వం.. ఎలాంటి ఎజెండా వెల్లడించకపోవడంతో కేంద్రం ఉద్దేశం ఏంటనే ఊహాగానాలకు దారితీసింది. ప్రకటన వెలువడినప్పటినుంచి రాజకీయ పార్టీలు, నేతలు, ఎన్నికల నిపుణులు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఎజెండా అంచనా వేయడంలో తలమునకలయ్యారు. 

ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కమిటిటీ ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ నడ్డా కూడా మాజీ రాష్ట్రపతిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. దీంతో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పై బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకే  ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఊహాగానానాలకు మరింత బలపడుతున్నాయి. అయితే సెషన్ ను  ఎందుకు పిలిచారనేది ప్రస్తుతానికి  ధృవీకరించలేదు.


అయితే వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పై ఎందుకు ప్రాధాన్యత.. దీనిపై లా కమిషన్ ఏం చేబుతోంది..

లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని.. ఎన్నికల నుంచి పరిపాలనా  దృష్టిని అభివృద్ధిపై మళ్లించవచ్చని సూచించింది. 

ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశం నిరంతరం ఎన్నికల మోడ్ లో ఉండకుండా నిరోధించవచ్చు. అందువల్ల పరిపాలన దృష్టి అభివృద్ధి పైనే ఉంటుందని లాకమిషన్ నివేదిక సూచించింది.

కానీ ప్రస్తుత రాజ్యాంగ చట్టంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నిర్వహించడం సాధ్యం కాదని కూడా కమిషన్ నివేదికలో పేర్కొంది. 

ఇది జరగాలంటే రాజ్యాంగంలో సవరణ అవసరం అని తెలిపింది. 

కొత్తగా ఏర్పాటైన ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా ప్రధాన ఎన్నికల వరకు మాత్రమే పనిచేయాలని.. ఎన్నికలు సమకాలీకరించబడ్డాయని నిర్దారించుకోవాలని లాకమిషన్ సూచించింది.