ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు: కుటుంబ సభ్యులకు వాటాల ప్రకారం రేషన్

ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు: కుటుంబ సభ్యులకు వాటాల ప్రకారం రేషన్

ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు నినాదంతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2021-22 ద్వారా వలస కార్మికులకు మరింత వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. కుటుంబ సభ్యులు వేర్వేరుగా.. ఉంటున్నట్లయితే.. నచ్చినచోట మొత్తం రేషన్ ను ఒకేసారి తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఇకముందు అలాంటి పరిస్థితి ఉండదు. కుటుంబ సభ్యులు వేర్వేరుగా  ఎవరి వాటా వారు నచ్చినచోట.. అనుకూలంగా ఉన్నచోట్ల నచ్చినట్లు వాటాల ప్రకారం సరుకులు తీసుకోవచ్చు. ఒకే ఊరిలో ఉన్నా..

వేర్వేరు ఊర్లలో ఉన్నా… చివరకు వేర్వేరు రాష్ట్రాల్లో.. ఉంటున్నా సరే.. తమ వాటా ప్రకారం రేషన్ సరుకులు తీసుకోవచ్చు. 32 రాష్ట్రాలో వన్ నేషన్.. వన్ రేషన్ పథకం.. లో భాగంగా వలస కార్మికులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను మరింత సరళతరం చేసింది. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.  కుటుంబ సభ్యులు వేరేచోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్ తీసుకునే అవకాశం కల్పించారు. సామాజిక ఆహార భద్రతలో భాగంగా వలస కార్మికులు ఎక్కడకు వెళ్లినా ఇబ్బంది పడకూడదని ఈ సౌకర్యాన్ని కల్పించారు.