
నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: ఆయిల్ పామ్ గెలలు కోసే కత్తి కోసుకుని ఒకరు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఏనెకుంట తండాకు చెందిన రమేష్(35) గురువారం బైక్ పై సొంతూరుకు వెళ్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన దామోదర్ ఆయిల్ పామ్ తోటలో పని చేసే కూలీతో పాటు బైక్పై గెలలు నరికే కత్తిని కట్టుకుని వెళ్తుండగా.. వెనక నుంచి రమేష్ ఢీకొట్టాడు.
దీంతో ప్రమాదవశాత్తు కత్తి రమేష్ మెడకు కోసుకోవడంతో స్పాట్లో చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డెడ్ బాడీతో రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ఉద్రికత్త నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చూస్తామని పోలీసులు హామీ ఇవడంతో ఆందోళన విరమించారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దంతాలపల్లి పోలీసులు తెలిపారు.