నిమ్మల శ్రీరామ్, మౌనిక జంటగా ఏఎస్ఆర్ (శ్రీరామ్) రూపొందించిన చిత్రం ‘1+1 ఆఫర్’. వి.వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. శుక్రవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన దర్శకుడు వి సముద్ర, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ సినిమా సక్సెస్ సాధించాలని కోరారు.
హీరోయిన్ మౌనిక మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నటిగా నా పెర్ఫార్మెన్స్‌కు పేరొస్తుందని నమ్ముతున్నా. ఈ టైటిల్ వెనుక ఇంటరెస్టింగ్ స్టోరీ ఉంది’ అని చెప్పింది. అందరూ మెచ్చేలా ‘1+1 ఆఫర్’ చిత్రం ఉంటుందని దర్శక నిర్మాతలు అన్నారు.
