పుణెకు క్వింటా గంజాయి ..ఓఆర్ఆర్ వద్ద పట్టుకున్న పోలీసులు

పుణెకు క్వింటా గంజాయి ..ఓఆర్ఆర్ వద్ద పట్టుకున్న పోలీసులు

గండిపేట్, వెలుగు: ఒడిశా నుంచి పుణెకు భారీగా గంజాయి తరలిస్తుండగా హైదరాబాద్​లో రాజేంద్రనగర్​ పోలీసులు, ఎస్​వోటీ సిబ్బంది పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. పుణెకు చెందిన ప్రశాంత్‌‌‌‌గణేశ్​(29), లతాగణేశ్​(40), సచిన్‌‌‌‌ దిలీప్‌‌‌‌రణవారే(37), రోహన్‌‌‌‌ పాండురంగ్‌‌‌‌ పవార్, రాహుల్‌‌‌‌ బాబురావు ధవ్రే(28), గౌరవ్‌‌‌‌ నటేకర్‌‌‌‌(26), పవన్‌‌‌‌ దీప్‌‌‌‌ ఒడిశాలో 108 కిలోల గంజాయి  కొన్నారు. 

సరుకును విశాఖపట్నం, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్‌‌‌‌ మీదుగా పుణెకు తరలించేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఓఆర్​ఆర్​ నుంచి హైదరాబాద్​కు చేరుకున్నారు. రెండు కార్లలో వెళ్తుండగా ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ టోల్‌‌‌‌ ఎగ్జిట్‌‌‌‌ నెంబర్‌‌‌‌ 17 వద్ద రాజేంద్రనగర్​పోలీసులు, ఎస్​వోటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని 108 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, కార్లతో పాటు ఆరు సెల్‌‌‌‌ఫోన్లు, రూ.9,700 సీజ్​ చేశారు.