
బ్యాటింగ్ ఘోరం.. బౌలింగ్ నాసిరకం.. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ స్ మరింత అధ్వానం.. లైనప్‌లో నిలకడ లేదు.. కుర్రాళ్లలో నిలబడాలనే తపన లేదు.. ఇలా ప్రతి వ్యూహంలో మిస్ ఫైర్ అయిన టీమిండియా.. తొలి వన్డేలో ఘోరంగా తడబడింది. అదే సమయంలో కసి, పట్టుదల, ఓపిక చూపెట్టిన ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచి.. మూడు మ్యాచ్ ల సిరీస్ లో1–0తో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 49.1 ఓవర్లలో 255 రన్స్ కు ఆలౌటైంది. శిఖర్ ధవన్ (91 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 74), కేఎల్ రాహుల్ (61 బంతుల్లో 4 ఫోర్లతో 47) మాత్రమే రాణించారు.తర్వాత ఆసీస్ 37.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 258 రన్స్ చేసింది. వార్నర్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం రాజ్‌కోట్ లో జరుగుతుంది.
కీలక భాగస్వామ్యం ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఓవర్ లోనే స్టార్క్ (3/56).. హిట్ మ్యాన్ రోహిత్ (10) ను ఔట్ చేసి షాకిచ్చాడు. దీంతో 13/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన రాహుల్ ఫామ్‌ను కొనసాగించాడు. రెండో ఎండ్ లో ధవన్ కూడా నిలకడగా ఆడాడు. ఆరంభంలో అప్రమత్తంగా ఆడినా.. తర్వాత భారీ షాట్లకు తెరలేపాడు. బలమైన కంగారూల పేస్ అటాక్ ను దీటుగా ఎదుర్కొన్న ఈ జోడీ.. మంచి బంతుల్ని గౌరవిస్తూనే, చెడ్డ బాల్స్ ను బౌండరీలకు తరలించింది. ఫలితంగా పవర్ ప్లేలో ఇండియా వికెట్ నష్టాని కి 45 రన్స్ చేసింది. తన క్లాస్ , మాస్ షాట్లతో ఓవర్ కు ఒకటి, రెండు ఫోర్లు బాదిన ధవన్ .. 20వ ఓవర్ లో జంపా బాల్ కు సిం గిల్ తీసి హాఫ్ సెం చరీ (66 బాల్స్ లో) పూర్తి చేశాడు. కానీ తర్వాతి ఓవర్ (అగర్ )లో శిఖర్ ఇచ్చిన క్యాచ్ ను మిడ్ వికెట్ లో వార్నర్ మిస్ చేశాడు. అవతలివైపు రాహుల్ కూడా తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో పాటు వేగంగా సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్ స్ కు 28వ ఓవర్ లో అగర్ బ్రేక్ వేశాడు. అద్భుతమైన ఫ్లోటెడ్ బాల్ ను డ్రైవ్ చేయబోయిన రాహుల్ కవ- ర్స్ లో స్మిత్ కు చిక్కాడు. తర్వాతి ఓవర్ లో కమిన్స్ పేస్ తగ్గించి వేసిన బాల్ కు ధవన్ ఔటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్ కు 121 రన్స్ సమకూరాయి.
టపటపా..
29 ఓవర్లలో 141/3 స్కోరు తో మంచి స్థితిలో ఉన్న ఇండియాను ఆసీస్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. రాహుల్ ,ధవన్ ఇచ్చిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడిలో పడేశారు. ఈ ఇద్దర్ని అకామిడేట్ చేసేందుకు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ (16) మంచి అటాకింగ్ మూడ్‌లో కనిపించాడు. కానీ 10 బంతుల వ్యవధిలో విరాట్ తో పాటు శ్రేయస్ (4) కూడా ఔట్ కావడంతో ఇన్నింగ్స్ తడబడింది. జంపా టర్న్‌కు విరాట్ ఔటైతే..స్టార్క్ దెబ్బకు శ్రేయస్ పెవిలియన్ కు చేరాడు. జడేజా (25), పంత్ (28) డ్యామేజ్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్ కు 49 రన్స్ జోడించి గాడిలో పెట్టినా.. వరుస ఓవర్లలో ఔట్ కావడంతో స్కోరు బోర్డుకు కళ్లెం పడింది. చివర్లో కుల్దీప్ (17), శార్దూ ల్ (13), షమీ (10) యూస్ ఫుల్ బౌండరీలు కొట్టినా.. పూర్తి ఓవర్లు ఆడలేకపోయారు. తొలి 27 ఓవర్లలో 134/1తో ఉన్న ఇండియా.. చివరి 22.1 ఓవర్లలో 121 రన్స్ చేసి 9 వికెట్లు చేజార్చుకుంది.
రికార్డు పార్ట్‌నర్ షిప్‌టార్గెట్ ఛేజింగ్ లో ఆసీస్ ఓపెనర్లు వార్నర్ , ఫించ్ అత్యద్భుతంగా ఆడారు. దీనికి తోడు బుమ్రా, షమీ, స్పిన్నర్లు ఘోరంగా తేలిపోయారు. వికెట్లు తీయకపోయినా.. కనీసం రన్స్‌ను కూడా కట్టడి చేయలేకపోయారు. 6వ ఓవర్ లో ఠాకూర్ వేసిన బౌలింగ్ లో వార్నర్ కీపర్ కు క్యాచ్ ఇవ్వడంతో గట్టిగా అప్పీల్ చేయడంతో అంపైట్ ఔట్ ఇచ్చిడు. అయితే రివ్యూకు వెళ్లాలా.. వద్దా అని ఫించ్ తో మాట్లాడిన వార్నర్ లాస్ట్ సెకన్ లో రివ్యూ కోరాడు. అదే కొంప ముంచింది. రివ్యూలో భారత్ ఓడింది. ఇక వార్నర్ రెచ్చి పోయాడు. ఫలితంగా బుమ్రా వేసిన 8వ ఓవర్ లో ఓ సిక్స్ , రెండు ఫోర్లతో రెచ్చి పోయిన వార్నర్ .. తర్వాత మరో రెండు బౌండరీలు బాదాడు. ఆ ఒక్క సెకన్ అయిపోతే .. మ్యాచ్ ఇండియా వైపు తిరిగే అవకాశం ఉండేది.
మధ్యలో ఫించ్ కూడా రెండు బౌండరీలు రాబట్టడంతో తొలి 10 ఓవర్లలో 8.4 రన్ రేట్ తో 84 రన్స్ వచ్చాయి. మిడిల్ మ్యాచ్ లో స్పిన్నర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా .. జడేజా బౌలింగ్ లో వార్నర్ రెండో సిక్సర్ కొట్టి ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. 13 ఓవర్లలోనే ఆసీస్ స్కోరు 100 దాటింది. అదే క్రమంలో వార్నర్ (40 బాల్స్ ), ఫించ్ (52 బాల్స్ ) హాఫ్ సెంచరీలు పూర్తి చేసి కుదురుకున్నారు. సింగిల్స్ తో పాటు ఎక్కువగా గ్యాప్‌ల్లో బంతిని బౌండరీలకు తరలించడంతో ఫీల్డర్లకు పెద్దగా పని లేకపోయింది. ధాటిగా ఆడుతున్న వార్నర్ ను 29వ ఓవర్ లో జడేజా ఔట్ చేసినంత పని చేశాడు. సుడులు తిరుగుతూ వచ్చిన బాల్ ను స్వీప్ చేసిన వార్నర్ వికెట్ల ముందు దొరికాడు. అంపైర్ వేలు పైకెత్తడంతో వెంటనే రివ్యూకు వెళ్లాడు.రీప్లేలో బాల్ ఇన్ సైడ్ ఎడ్జ్ అయ్యిందని తేలడంతో ఇండియాకు నిరాశ తప్పలేదు. అప్పటి కే 90ల్లోకి వచ్చిన వార్నర్ .. మరో రెండు ఫోర్లు కొట్టి కెరీర్‌లో 18వ సెంచరీ (88 బాల్స్ )ని అందుకున్నాడు. టీమ్ స్కోరును కూడా 200లకు చేర్చాడు. రెండో ఎండ్ లో ఫించ్ కూడా చకచకా బౌండరీలతో 108 బాల్స్ లో సెంచరీ పూర్తి చేశాడు. అప్పటికే చేయాల్సిన టార్గెట్ చిన్నదిగా మారడంతో వార్నర్ , ఫించ్ నింపాదిగా ముగించేశారు.