తిరుపతి జూలో ఓ పులి పిల్ల చనిపోయింది. రెండు నెలల కిందట నల్లమలలో తల్లికి దూరమైన 4 పులి పిల్లలను తిరుపతి ఎస్వీ జూకు తరలించారు అధికారులు. వాటిలో ఒకటి అనారోగ్యానికి గురై మే 29న మరణించినట్లు అధికారులు చెప్పారు. పులి పిల్లకు పోస్టు మార్టం చేయగా కిడ్నీ, లివర్ సమస్యతో చనిపోయినట్లు తేలింది.
దీంతో మిగతా వాటి సంరక్షణపై దృష్టి సారించారు అధికారులు. వాటికి బ్లడ్ శాంపిల్స్ సేకరించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో వైపు ఇటీవల ఆఫ్రికా నుంచి తెచ్చి మధ్యప్రదేశ్ కునో పార్కల్ వదిలిన 3 చీతాలు, 3 కూనలు మరణించిన విషయం తెలిసిందే.
