OnePlus 15 ఇండియాలో లాంచ్ అయింది.. ఫీచర్స్ అదుర్స్ !

OnePlus 15 ఇండియాలో లాంచ్ అయింది.. ఫీచర్స్ అదుర్స్ !

OnePlus 15 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో గురువారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ OnePlus 15 మన దేశంలోని మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 SoC స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఇది 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో.. 6.78 అంగుళాల QHD+ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంది. ఇది వైర్డు, వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. 7,300mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ సామర్థ్యం ఈ OnePlus 15 సొంతం.

కెమెరా విషయానికొస్తే.. OnePlus 15.. 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో హై క్వాలిటీ రిజల్యూషన్తో ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. 8K రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చంటే వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ సంస్థ.. అమెజాన్ వెబ్సైట్తో పాటు.. వన్ ప్లస్ కంపెనీ స్టోర్స్లో OnePlus 15 స్మార్ట్ ఫోన్ను వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు.

ఇక ఇండియాలో OnePlus 15 ధర ఎంతంటే.. 12GB RAM + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర 72 వేల 999 రూపాయలు. 16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 79 వేల 999 రూపాయలు. అయితే.. HDFC బ్యాంక్ ఆఫర్‌తో వినియోగదారులు 12GB RAM + 256GB వేరియంట్పై రూ. 4 వేలు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో.. ఫైనల్గా OnePlus 15 బేస్ వేరియంట్ 68 వేల 999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

►ALSO READ | Cancer treatment: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. డైరెక్టుగా క్యాన్సర్ కణంపై పనిచేసే మందులు రెడీ

OnePlus 15 స్మార్ట్ ఫోన్ను ఇండియాలో గురువారం రాత్రి 8 గంటల నుంచి సేల్కు అందుబాటులో ఉంచారు. OnePlus 15 ఇన్ఫినిట్ బ్లాక్, సాండ్ స్టార్మ్, అల్ట్రా వైలెట్ రంగులలో అందుబాటులో ఉంది. 120W SuperVOOC వైర్డు, 50W AirVOOC వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,300mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ తయారైంది. బ్యాటరీని దాదాపు 39 నిమిషాల్లో 0 శాతం నుంచి పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.