బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై ఖమ్మంలో ఆందోళనలు కొనసాగాయి. సాయిగణేష్ ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయే కారణమంటూ రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ నిరసన తెలిపారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రి అద్ధాలు ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. మంత్రి పువ్వాడ అజయ్ ఫ్లెక్సీలను తగులబెట్టారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. చివరకు సాయిగణేష్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు.
ఖమ్మం పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యయత్నం చేసిన BJP కార్యకర్త చనిపోయాడు. ఖమ్మం జిల్లా మజ్దుర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు సాయిగణేష్ తనను పోలీసులు పలు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ నిన్న త్రీ టౌన్ పీఎస్ ఆవరణలో పురుగుల మందు తాగాడు. అయితే సాయి గణేష్ పరిస్థితి విషమించడంతో బీజేపీ నేతలు హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ సాయి గణేష్ ఈ రోజు చనిపోయాడు. మంత్రి పువ్వాడ అజయ్ వల్లే సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.
