కరీంనగర్ జిల్లాలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షలను మరింత కఠిన తరం చేశారు అధికారులు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో పాటు… వారితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నాయి వైద్య బృందాలు.
జిల్లాలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. అంతేకాదు దగ్గు, జలుబు, జ్వరం కోసం నేరుగా మందులు కొనుక్కునేందుకు వచ్చే వాళ్లకు మెడిసిన్స్ ఇవ్వొద్దని మెడికల్ షాప్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. కరోనా లక్షణాలు ఉన్న వాళ్లకు ట్రీట్మెంట్ చేయవద్దని RMP,PMPకు సూచించారు. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జగిత్యాల జిల్లా నుంచి మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారిలో కొందరిని పొలాస వ్యవసాయ కాలేజీలో, మరికొందరిని JNTU క్వారంటైన్ కు తరలించారు అధికారులు.

