శ్రీరాంసాగర్లో పెరుగుతున్న నీటిమట్టం

 శ్రీరాంసాగర్లో పెరుగుతున్న నీటిమట్టం

నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద వచ్చి చేరుతోంది. తొలకరి వర్షాలతో మొదలైన వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2893 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టిఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1066.6అడుగులకు చేరుకుంది. డ్యాంలో నీటిమట్టం 22.924టిఎంసీలకు పెరిగింది.