ఉప్పల్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్ నగర్ కు చెందిన గడ్డం రవి–రజిత దంపతుల కుమారుడు అరుణ్ కుమార్(18) దిల్సుఖ్నగర్ లోని స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో ఫస్టియర్చదువుతున్నాడు.
ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటుపడి, దాన్ని మానలేక మనోవేదనకు గురయ్యాడు. గురువారం ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తల్లిదండ్రులు వచ్చి హాస్పిటల్ కు తీసుకెళ్లగా మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
