
ఫుడ్ టెక్నాలజీలతో అద్భుతాలు చేయొచ్చని సృష్టి సుందరం నిరూపించారు. ఆన్లైన్ గ్రాసరీ జూపిటర్ డాట్ సీఓ ద్వారా ఎంతో మందికి మేలు చేస్తున్నారు. ఆయన కృషి ఫలితంగా అమెరికాలో ఫుడ్క్రియేటర్లు భారీగా సంపాదిస్తున్నారు. బ్రాండ్ పార్ట్నర్షిప్స్కుదుర్చుకుంటున్నారు. కస్టమర్లు నిత్యం కొత్త వంటకాల గురించి తెలుసుకుంటున్నారు. కంపెనీలు సులువుగా, వేగంగా కస్టమర్లను సంపాదించుకుంటున్నాయి.
న్యూఢిల్లీ: ఆన్లైన్గ్రాసరీ సెల్లర్ జూపిటర్ కో–ఫౌండర్సృష్టి సుందరం ఫుడ్‌టెక్నాలజీ రంగంలో అద్భుత మార్పులు తీసుకొచ్చారు. దీంతో వేలాది మందికి మేలు జరుగుతోంది. కస్టమర్లతోపాటు వంటల సృష్టికర్తలూ లాభపడుతున్నారు. కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్(సీపీజీ) సెక్టార్లో కొత్త పద్ధతులను తీసుకొచ్చారు. ఫుడ్బ్రాండ్లు కస్టమర్లకు మరింత చేరువ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రొడక్షన్ డెవెలప్మెంట్, సప్లై చెయిన్ ఆప్టిమైజేషన్, డిజిటల్ కామర్స్‌పై పట్టు ఉండటం వల్ల జూపిటర్ను కస్టమర్ల ఫేవరెట్‌గా మార్చగలిగారు . రిటైల్ వ్యాపారంలో ఎన్నో కొత్త మార్పులకు పునాది వేశారు. సృష్టి ఫోర్బ్స్ టెక్నాలజీ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తూ ఆహార పరిశ్రమ మరింతగా ఎదిగేలా చేశారు. రెండువేలకుపైగా ఉత్పత్తుల మార్కెటింగ్‌కోసం సరఫరా గొలుసును అభివృద్ధి చేశారు. 400 మందికి పైగా ఫుడ్ క్రియేటర్స్ తమ కంటెంట్‌తో డబ్బులు సంపాదించుకోవడానికి, 50కిపైగా అమెరికా ఫుడ్ బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను మరింత సమర్థవంతంగా మార్కెట్ చేయడానికి సహాయపడుతున్నారు.
జూపిటర్ ద్వారా ఫుడ్క్రియేటర్లు ఆన్లైన్ షాపులు నిర్వహించవచ్చు. కమ్యూనిటీలను నిర్మించవచ్చు. తాము కనిపెట్టిన వంటలతో డబ్బు సంపాదించవచ్చు. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ కుదుర్చుకోవచ్చు. కస్టమర్లు కొత్త వంటకాల గురించి తెలుసుకోవచ్చు. కిరాణాల జాబితాను మరింత బాగా తయారు చేయవచ్చు. తన అభిమాన ఫుడ్క్రియేటర్ గురించి కస్టమర్ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవచ్చు. ఆటోమేటెడ్ఆర్డర్, ఇన్వెంటరీ ట్రాకింగ్‌సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. జూపిటర్ అమెరికాలో పనిచేస్తున్నప్పటికీ సృష్టి తెచ్చిన మార్పులు మనదేశంలోని ఈ–కామర్స్, ఫుడ్-టెక్ రంగాలకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పించాయని ఫుడ్‌టెక్నాలజీ ఎక్స్పర్టులు అంటున్నారు.