క్యాష్​ ఇస్తే.. ఆన్ లైన్​లో ట్రాన్స్​ఫర్​ చేస్తా

V6 Velugu Posted on Oct 19, 2021

ఖైరతాబాద్, వెలుగు: లిక్విడ్ క్యాష్​ఇస్తే ఆన్ లైన్ లో ఆ అమౌంట్​ను ట్రాన్స్ ఫర్ చేస్తానని చెప్పి ఓ వ్యక్తి దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని పరారైన నిందితుడిని ఎస్ ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలుకు చెందిన ఇంటిపల్లి రామారావు(27) కేపీహెచ్ బీకాలనీలోని వేద లగ్జరీ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. ముషీరాబాద్​లో ఉండే గౌతమ్ కృష్ణ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. ఈ నెల 7న రూ.లక్ష డిపాజిట్ చేసేందుకు గౌతమ్ ఎస్ఆర్ నగర్​లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్​కు వెళ్లాడు. అదే టైమ్​లో అక్కడికి వచ్చిన రామారావు రూ.లక్ష లిక్విడ్ క్యాష్ ఇస్తే ఆన్ లైన్​లో ఆ డబ్బును ట్రాన్స్ ఫర్ చేస్తానని గౌతమ్​ను నమ్మించాడు. గౌతమ్ నుంచి డబ్బు తీసుకున్న రామారావు రూ.లక్ష ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఫేక్ మెసేజ్​ను అతడి మొబైల్​కి పంపి పరారయ్యాడు. అమౌంట్ తన అకౌంట్​​లో క్రెడిట్ కాలేదని గుర్తించిన గౌతమ్ మోసపోయినట్లు తెలుసుకుని ఈ నెల 12న ఎస్ఆర్ నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రామారావును సోమవారం అరెస్ట్ చేశారు. అతడి దగ్గరి నుంచి రూ.95 వేల క్యాష్​, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ రామారావు ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, చందానగర్, కేపీహెచ్​బీ పీఎస్​ల పరిధిలో ఇతడిపై కేసులున్నాయన్నారు.

Tagged online money transfer, hyderabad police, fraud, accused, arrest

Latest Videos

Subscribe Now

More News