హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 3.9 శాతం మందికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ లెక్కన 18 ఏండ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌పూర్తి కావాలంటే కనీసం ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు, కంపెనీల ప్రొడక్షన్ కెపాసిటీ, వచ్చే మూడు నెలల పాటు కంపెనీలు సప్లై చేయబోయే ఆర్డర్లను బట్టి జులై నుంచి వ్యాక్సిన్ప్రక్రియ వేగం పుంజుకోనుంది. కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రాలు సైతం గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. దీంతో డిసెంబర్చివరికి అందరికీ వ్యాక్సినేషన్పూర్తవుతుందని సర్కారు అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 18 ఏళ్లకు మించిన జనాభా 2.64 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 45 ఏళ్లకు పైబడిన వారు 92 లక్షల మంది ఉన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు రెండు డోసులు వేయించుకున్నది కేవలం 10.36 లక్షల మంది మాత్రమే. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ అనుమతించిన జనాభాలో మన రాష్ట్రంలో 3.9 శాతం మందికే రెండు డోసులు అందాయి. ఇక ఒక్క డోస్ వేసుకుని రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వారు 44.41 లక్షల మంది ఉన్నారు. కొవాగ్జిన్టీకావేసుకున్న వారు నాలుగు నుంచి ఆరు వారాల మధ్య సెకండ్ డోస్ వేసుకోవాల్సి ఉంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్వేసుకున్న వారు ఆరు నుంచి ఎనిమిది వారాల లోపు రెండో డోస్ వేసుకోవాలి. నిర్ణీత గడువు ముంచుకొచ్చిన వారంతా ఆందోళన చెందుతుండటంతో సెకండ్ డోస్ వేసుకునేటోళ్లకు ప్రియారిటీ ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందుకే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు వారికి వ్యాక్సినేషన్ నెలాఖరు వరకు వాయిదా వేసింది. అయితే కొవిషీల్డ్ రెండో డోస్ 12 నుంచి 16 వారాల మధ్య తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని కేంద్రం తాజాగా సూచించింది.
వ్యాక్సినేషన్‌పై లాక్‌డౌన్ ఎఫెక్ట్
రాష్ట్రంలో రోజూ వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర జనం కిక్కిరిసిపోయి కనిపించే సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. లాక్డౌన్ఎఫెక్ట్ వ్యాక్సినేషన్‌పై కనిపిస్తోంది. రోజూ భారీ క్యూలతో కనిపించే వ్యాక్సిన్ సెంటర్లు రెండ్రోజులుగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు సగటున రోజూ 70 వేల మందికి వ్యాక్సిన్ వేస్తే, బుధ, గురువారాల్లో ఈ సంఖ్య దానిలో సగానికి కూడా చేరలేదు. బుధవారం 24,864 మందికి, గురువారం 30,355 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ వ్యాక్సిన్ వేస్తున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ, లాక్‌డౌన్ సడలింపులు ఉదయం పది గంటల వరకే ఉండడంతో, ఆ తర్వాత బయటకు వెళ్లడానికి జనాలు భయపడుతున్నారు. పోలీసులు ఫైన్లు వేయడం, లాఠీలు ఝులిపించడం లాంటివి చేస్తారేమోనని ఇంటికే పరిమితమవుతున్నారు. ఇతర రాష్ర్టాల్లో వ్యాక్సినేషన్ స్పీడప్ చేస్తుంటే, మన దగ్గర నెమ్మదిస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలు, స్కూళ్లు వంటి అన్ని ప్రదేశాల్లో వ్యాక్సిన్ సెంటర్లు పెట్టాలని సూచిస్తున్నారు
