అయోధ్యలో వాళ్లకు మాత్రమే ఎంట్రీ.. సర్కార్ కీలక ఆదేశాలు

అయోధ్యలో వాళ్లకు మాత్రమే ఎంట్రీ.. సర్కార్ కీలక ఆదేశాలు

కొత్తగా నిర్మిస్తోన్న రామ మందిర ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న జరగబోయే ఈ ప్రతిష్టాపక క్రతువుకు రామ మందిర ట్రస్ట్, ప్రభుత్వ విధుల్లో చెల్లుబాటు అయ్యే ఆహ్వానాలు ఉన్నవారు మాత్రమే అయోధ్యలో ప్రవేశానికి అనుమతించనున్నారు. డిసెంబర్ 21న అయోధ్యలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..  ఇతర వ్యక్తుల ముందస్తు బుకింగ్‌లను రద్దు చేయాలని, ట్రస్ట్ ఆహ్వానించిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక హోటల్ యజమానులను, అయోధ్య అధికారులను ఆదేశించారు.

అయోధ్యలో యాత్రికుల వసతి కోసం ట్రస్ట్ ఏర్పాట్లతో పాటు, ధర్మశాల, హోటళ్ళు మొదలైన ప్రదేశాల్లో యాత్రికులు బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. జనవరి 22న జరగబోయే ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు ఉన్నవారు, ప్రభుత్వ విధుల్లో ఉన్నవారు మాత్రమే అయోధ్య లోపలికి అనుమతి ఉంటుందని తెలిపారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠా వేడుక రోజున కొంతమంది స్థానిక హోటళ్లు, ధర్మశాలలను బుక్ చేసుకున్నట్లు తెలిసిందని, నిర్వహణలో ఎలాంటి సమస్య రాకుండా వారి బుకింగ్ ను రద్దు చేయాలన్నారు. ఎందుకంటే ఆ రోజున భారతదేశం నలుమూలల నుంచి అయోధ్యకు పలువురు అతిథులు రానున్నారని చెప్పారు. దాంతో పాటు అయోధ్య విమానాశ్రయానికి 100 విమానాలు వచ్చే అవకాశం ఉందన్న ఆయన.. వాటి మళ్లింపు కోసం కూడా ఏర్పాట్లు చేయండని ఆయన అధికారులను ఆదేశించారు.