నెట్టెంపాడు ప్రాజెక్టుకు గండ్లు పడుతున్నా.. పట్టించుకునే దిక్కు లేదు

నెట్టెంపాడు ప్రాజెక్టుకు గండ్లు పడుతున్నా.. పట్టించుకునే దిక్కు లేదు

కాలువల మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌కు నిధుల్లేవ్

కాలువలకు గండ్లు పడుతున్నా.. పట్టించుకుంట లేరు

11 టీఎంసీలకు… ఎత్తి పోసింది 3 టీఎంసీలే‌

మూడు మోటార్లకు ఒక్కటే నడుస్తున్నది

ఇదీ నెట్టెంపాడు ప్రాజెక్టు పరిస్థితి

గద్వాల, వెలుగు: నెట్టెంపాడు ప్రాజెక్టు ప్రారంభమై ఏడేళ్లు గడుస్తున్నా సగం ఆయకట్టు కూడా తడవడం లేదు. మెయింటెనెన్స్‌ కు నిధుల్లేక అంతా అస్తవ్యస్తంగా మారింది. మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , సబ్‌ కెనాల్స్‌ కు గండ్లు పడి నీళ్లు వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పిల్లకాలువల ముచ్చటే లేదు. మూడు మోటార్లకు ఒక్కటి మాత్రమే నడుస్తోంది. 11 టీఎంసీల నీరు ఎత్తి పోయాల్సి ఉండగా నెల రోజుల నుంచి కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జూరాల బ్యాక్‌ వాటర్‌ నుంచి ..

గద్వాల జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే లక్ష్యంతో 2006లో నెట్టెంపాడు ప్రాజెక్టును రూపొందించారు. జూరాల బ్యాక్ వాటర్ నుంచి కొంతమేర గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని మళ్లించి, గుడ్డందొడ్డి సమీపంలో సర్జ్‌ పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగు మోటార్లు ఏర్పాటు చేసి నీటిని లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని డిజైన్ చేశారు. ఇందులో మూడు మోటార్లు పనిచేసేలా మరోటి స్టాండ్‌ బైగా ఉంచి 2013లో ఎత్తిపోతల ప్రారంభించారు. కానీ, ఏనాడూ మూడు మోటార్లు నడపలేదు. ప్రస్తుతం ఒక మోటారు మాత్రమే నడుస్తోంది.

ఏడు రిజర్వాయర్లు

నెట్టెంపాడు కింద మొత్తం ఏడు రిజర్వాయర్లను నిర్మించాలని డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి , నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దొడ్డి , తాటికుంట, ముచ్చోనిపల్లి పూర్తి కాగా.. చిన్నోచిపల్లి, సంగాల రిజర్వయర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ర్యాలంపాడు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(4టీఎంసీలు) పెద్దది. గుడ్డందొడ్డి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కెనాల్ ద్వారా ఇందులోకి నీళ్లు చేరుతాయి. అక్కడినుంచి మిగతా రిజర్వాయర్లకు ఎత్తి పోస్తారు. ఇందుకోసం అక్కడ నాలుగు మోటార్లను ఏర్పాటు చేశారు. కానీ అక్కడ కూడా ఒక మోటార్ మాత్రమే నడుపుతున్నారు.

లక్ష ఎకరాలకే గతిలేదు

ఈ ప్రాజెక్టు నుంచి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఉన్నా… లక్ష ఎకరాలకు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఆఫీసర్లు లక్ష ఎకరాలకు నీరివ్వడమే లక్ష్యంగా 11 టీఎంసీలు ఎత్తిపోయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు కేవలం 3 టీఎంసీల నీళ్లు మాత్రమే లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రస్తుతం ర్యాలంపాడులో 2 టీఎంసీలు, గుడ్డెందొడ్డిలో ఒక టీఎంసీ లోపు మాత్రమే నిల్వ ఉన్నది. ఇప్పటి కే జూరాల ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీరు దిగువకు వెళ్లిపోయింది. వరి నాట్లు వేసే టైం కూడా మించిపోతోంది.

నాలుగేళ్ల నుంచి నిధులు లేవు

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మెయింటెనెన్స్ కు నాలుగేళ్ల నుంచి నిధులు రావడం లేదు. దీంతో మోటార్లు, కెనాల్స్‌ అస్తవ్యస్తంగా మారాయి. ట్రాన్స్‌ ఫార్మర్లకు ఆయిల్, మోటార్లకు బేరింగ్‌ లు లేకపోయినా పట్టించుకుంటలేరు. కాల్వలు మరీ అధ్వానంగా మారాయి. సీసీలైనింగ్ లేక గండ్లు పడుతున్నాయి. పిల్లకాలువల అసలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ర్యాలంపాడు దగ్గర కాల్వకు మట్టి అడ్డంగా ఉన్న తొలగించడం లేదు.

రెండో మోటార్ ఆన్ చేస్తాం

త్వరలోనే నెట్టెంపాడు రెండో మోటారును ఆన్ చేస్తాం. ఇప్పటి వరకు 3 టీఎంసీల నీరు ఎత్తిపోశాం. ర్యాలంపాడు దగ్గర మట్టి అడ్డం ఉన్న విషయం వాస్తవమే. తొలగించేలా చర్యలు తీసుకుంటాం. మెయింటె నెన్స్ నిధుల వస్తే వెంటనే కాల్వలకు రిపేర్లు చేస్తం.- రహీమోద్దీన్, నెట్టెంపాడు ప్రాజెక్టు ఈఈ..