
మాది కొత్త కథ, మేము కొత్త సినిమాతో వస్తున్నాం. ఇది మాములుగా ఫిల్మ్ మేకర్స్ చెప్పే మాట. కానీ, తీరా సినిమా చూశాక రొటీనే కదా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ, చెప్పిన మాట మీద నిలబడే దర్శకుడు వీఐ ఆనంద్(VI Anand). ఆయన చేసిన సినిమాలు చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతీ సినిమాలో ఎదో ఒక కొత్త కంటెంట్ ను చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ దర్శకుడు. అందులో భాగంగా వచ్చినవే ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, టైగర్ సినిమాలు.
ఇక ఆయన నుండి వస్తున్న మరో ప్రయత్నం ఊరుపేరు భైరవకోన(Ooru Peru Bhairavakona). యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) హీరోగా వస్తున్న ఈ సినిమాలో.. కావ్య థాపర్ - వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అతీంద్రియ శక్తులు, అవి సృష్టించే అవరోధాలు, వాటిని అధిగమించి పోరాడే హీరో. ఇదే ఈ సినిమా కాన్సెప్ట్. ట్రైలర్ ఆడియన్స్ ను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఒక వైపు దైవశక్తి.. మరో దుష్ట శక్తి .. వాటన్నిటినీ మించి కర్మ సిద్ధాంతం. ఈ నేపధ్యంలో వచ్చిన సీన్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేశాయి. చూస్తుంటే ఈ సినిమాతో సందీప్ కిషన్ ఖచ్చితంగా హిట్టు కొట్టేలాగే కనిపిస్తున్నాడు.