IT News: ఇక టెక్కీల ఉద్యోగాలు ఊస్ట్.. కమ్ముకొస్తున్న కోడెక్స్ ఆందోళనలు..

IT News: ఇక టెక్కీల ఉద్యోగాలు ఊస్ట్.. కమ్ముకొస్తున్న కోడెక్స్ ఆందోళనలు..

Software Jobs: భారతదేశంలో అందులోనూ ప్రధానంగా దక్షిణాధి రాష్ట్రాల నుంచి ఐటీ పరిశ్రమలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువత సంఖ్య ఎక్కువ. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అయితే డాక్టర్ లేదంటే సాఫ్ట్ వేర్ ఎంప్లాయి ఈ రెండింటిలో ఏదైనా ఉంటేనే గౌరవం, కనీసం పెళ్లవ్వాలన్నా ఇవే క్వాలిఫికేషన్స్ అంటున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు. అయితే మరికొన్నాళ్లలో ఈ పరిస్థితులు పూర్తిగా తలకిందులు కాబోతున్నాయని తెలుస్తోంది.

రోజురోజుకూ ఏఐ వినియోగం విస్తరణ ప్రస్తుతం ఐటీ పరిశ్రమలోని ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే పెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ మానేసినవారి స్థానంలో ఏఐ టెక్నాలజీ టూల్స్ వినియోగిస్తూ లాభదాయకతను పెంచుకునేందుకు వెంపర్లాడుతున్నాయి. కొత్త రిక్రూట్మెంట్ల విషయంలో ఆచితూచి ముందుకు సాగుతున్నాయి. పైగా అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉండటంతో టెక్ పరిశ్రమ ప్రస్తుతం డౌన్ ట్రెండ్ చూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ ఐటీ పరిశ్రమ కోసం కొత్త సాధనాన్ని తీసుకొచ్చింది. దీనిపేరే కోడెక్స్. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లకు సులువుగా కోడింగ్ చేసేందుకు సహాయపడుతుందని తెలుస్తోంది. అంటే 10 మంది టెక్కీలు చేసే పనిని కేవలం ఇద్దరితో సాధించటానికి ఇది దోహపడొచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కోడెక్స్ టెక్నాలజీని మే 16 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఓపెన్ ఏఐ ప్రకటించింది. 

కోడెక్స్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే.. ఇది కోడింగ్ రాయటం నుంచి వాటిలో ఉన్న తప్పులను కనిపెట్టడం వరకు అన్ని పనులు చూసుకుంటుంది. ఇది క్లౌడ్ ఆధారంగా పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఏజెంట్ అని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీరు అడిగిన కోడింగ్ పూర్తి చేయబడుతుందని, పైగా యూజర్లు ఏకకాలంలో మల్టీటాస్కింగ్ చేసేందుకు సహాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. యూజర్లు తమ కోడింగ్ అవసరాలకు సమాధానం పొందేందుకు చాట్ డీపీజీలో అడిగినట్లుగానే ప్రాంమ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కోడెక్స్ ఉపయోగించి కోడింగ్ రాయమని అడిగితే, ఇంటర్నెట్ కనెక్షన్ వెంటనే డిస్‌కనెక్ట్ చేయబడి సాఫ్ట్‌వేర్ డెవలపర్లు తమ కోడింగ్‌ను నిల్వ చేసే గిట్‌హబ్ కి కనెక్ట్ అవుతుంది.