బాక్సింగ్ ఛాంపియన్షిప్‌ను ప్రారంభించిన కిషన్ రెడ్డి

బాక్సింగ్ ఛాంపియన్షిప్‌ను ప్రారంభించిన కిషన్ రెడ్డి

ఎల్బీ స్టేడియంలో ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గ్రాండ్ గా ప్రారంభమైంది. రెండు రోజులు ఈ పోటీలు జరగనున్నాయి. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ సహకారంతో… స్వామి వివేకానంద, మాజీ ప్రదాని వాజ్ పేయి జన్మదినం సందర్బంగా ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తోంది BJYM.  ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ లో రెండు రోజులు జరిగే ఈ పోటీలను కేంద్ర హోమ్ సహాయశాఖ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నేత వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఓపెనింగ్ సెర్మనీలో బీజేపీ నేతలు చింతల రాంచంద్రా రెడ్డి, రావూరి శ్రీధర్ రెడ్డి, తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిథులు పాల్గొన్నారు.

వచ్చే ఒలింపిక్ క్రీడల్లో దేశానికి గతం కంటే ఎక్కువ పతకాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. క్రీడల్లో రాణించాలంటే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. సత్తా ఉన్న ప్లేయర్లకి చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను తీసుకొచ్చిందన్నారు. ప్రజలంతా ఫిట్ గా ఉండాలన్న ఆయన ఇందుకోసమే మోడీ సర్కార్  ఫిట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొచ్చిందన్నారు.

కిక్ బాక్సింగ్ లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నేత వివేక్ వెంకటస్వామి. స్థానిక పోటీల్లో పాల్గొనడంతో ఇంటర్నేషనల్ క్రీడాకారులుగా తయారయ్యే అవకాశం ఉంటుందన్నారు. బీజేవైఎం ఏటా బాక్సింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.