
దసరా లోపు సినిమా థియేటర్స్ తెరవాలన్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏసియన్ సినిమాస్ సునీల్ ఎన్ నారంగ్. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర నష్టాల్లో ఉన్న వినోదరంగాన్ని కొంత గాడిలోకి తీసుకురావాలంటే దసరా, దీపావళి సీజన్ లో థియేటర్లు ఓపెన్ చేస్తే బాగుంటుందని థియేటర్ల యాజమాన్యాలు అనుకున్నట్లు తెలిపారు. 50 శాతం కెపాసిటీతో థియేటర్లు రీఓపెన్ చేసుకునే అవకాశమివ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. అయితే క్లోజ్ గా ఉండే ఆడిటోరియంలో ప్రేక్షకులు రావడంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్టు సునీల్ ఎన్ నారంగ్ తెలిపారు.