 
                                    - టెన్త్లో 48.86% , ఇంటర్లో 58.21% మంది పాస్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఎస్సీలో 48.86% , ఇంటర్ లో 58.21% మంది స్టూడెంట్లు పాసయ్యారు.
ఈ మేరకు గురువారం టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి ఫలితాలను సొసైటీ వెబ్ సైట్ www.telanganaopenschool.org లో పెట్టారు. గతనెల 22 నుంచి 28 వరకూ పరీక్షలు జరిగాయి.ఎస్ఎస్సీలో మొత్తం 9,717 మంది పరీక్షకు హాజరుకాగా.. 4,748 మంది పాస్ అయ్యారు. ఇంటర్మీడియెట్‌లో 11,520 మంది స్టూడెంట్లకు 6,706 మంది ఉత్తీర్ణత సాధించారు.

 
         
                     
                     
                    