హైదరాబాద్, వెలుగు: హోం రిటైల్, ఇంటీరియర్ డిజైన్ ప్రొవైడర్ హోం టౌన్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ప్రిజమ్ మాల్‌లో తన సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. ఈ ఆధునిక స్టోర్ తక్కువ ధరల్లో హోం, ఇండిపెండెంట్ రూం ప్యాకేజీలను, ఇంటి రెనోవేషన్, కొత్త హోం డిజైన్‌లను అందిస్తుంది. దాదాపు19వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోమ్‌టౌన్ స్టోర్‌లో ఫంక్షనల్ టేబుల్‌వేర్, కిచెన్‌వేర్, మాడ్యు కిచెన్లు, వార్డ్ రోబ్‌లు సహా ఎన్నో వస్తువులు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
