Operation Sindoor: AI తరహా టెక్నాలజీ.. శత్రువులను ముందుగానే గుర్తించి ఎలా దాడి చేసిందో చూడండి..!

Operation Sindoor: AI తరహా టెక్నాలజీ.. శత్రువులను ముందుగానే గుర్తించి ఎలా దాడి చేసిందో చూడండి..!

ఆపరేషన్ సిందూర్.. పహల్గాం ఉగ్రదాడికి భారత్ చేపట్టిన క్విక్ రెస్పాన్స్ యాక్షన్ ఇది. అమాయక టూరిస్టులను చంపిన టెర్రిరస్టులతో పాటు వారిని ప్రోత్సహిస్తూ వస్తున్న పాకిస్తాన్ కు కూడా ఈ ఆపరేషన్ తో బుద్ధి చెప్పింది ఇండియా. అయితే ఈ దాడిలో భారత్ ఏఐ తరహాలో శత్రువుల కదలికలు గుర్తించే టెక్నాలజీని వాడింది. 

సరిహద్దుల్లో ఉగ్రవాదులు, పాక్ ఆర్మీ కదలికలను ముందుగానే గుర్తించి వెంటనే అటాక్ చేసేలా వినియోగించిన టెక్నాలజీకి సంబంధించిన ఒక వీడియోను ఆర్మీ ఆఫీసర్లు  విడుదల చేశారు. ఉగ్రవాదుల కదలికలను గుర్తించి ర్యాపిడ్ ఫోర్స్ తో క్షణాల్లోనే దాడులు చేయటం వీడియోలో చూడవచ్చు. 

ALSO READ | గోల్డెన్‌‌ టెంపుల్‌‌ మీద ఒక్క గీత పడనియ్యలే.. గాల్లోనే పేల్చేశాం: ఇండియన్ ఆర్మీ

మే 7-8 రాత్రి పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని.. దీంతో తాము ప్రతిఘటించామని ఆర్మీ అధికారి చెప్పాడు. ముందుగా మామూలు మెషిన్ గన్స్ మాత్రమే వాడామని తెలిపాడు. తమ దాడిని తట్టుకోలేని పాక్.. యుద్ధం చేయలేక పూంచ్ సెక్టార్ లో అమాయకులపై కాల్పులు జరిపిందని తెలిపారు. యుద్ధ నీతిని మరిచి.. నిబంధనలు ఉల్లంఘించి కాల్పులు పరిపిందని వివరించారు. 

ఆపరేషన్ సిందూర్ సమయంలో LOC వెంట ఉన్న ఉగ్ర స్థావరాలతో పాటు ఆర్మీ క్యాంపులను కూడా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇంకా రెండు మూడు ఆర్మీ క్యాంపులు నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్) వెంబడి ఉన్నట్లుగా తెలిపారు. 

ఆపరేషన్ సిందూర్ సమయంలో.. రాత్రింబవళ్లు తాము శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. ఇండియా చేసిన  దాడితో మరోసారి కాల్పులు జరపాలంటే భయపడేలా బుద్ధి చెప్పినట్లు తెలిపారు. శత్రువుల కదలికలను ఆటోమేటిక్ గా గుర్తించి దాడి చేసే టెక్నాలజీ వాడటంతో పాక్ ఆర్మీ దిక్కు తోచని పరిస్తితుల్లో పడిపోయిందని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో కింద చూడవచ్చు.