
రాష్ట్రపతి ప్రసంగంలో జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకురావడంపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీలు. రాజకీయంగా ఏకాభిప్రాయం రాని అంశాన్ని రాష్ట్రపతి.. సభలో ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారమే వెళ్లాలని.. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేరళ, వెస్ట్ బెంగాల్ పై బీజేపీ కాన్సంట్రేషన్ పెట్టిందనే విషయాన్ని ఇండైరెక్ట్ గా రాష్ట్రపతితో చెప్పించారని విమర్శించారు. పార్లమెంట్ బయట కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రపతి ప్రసంగం ఎప్పటిలాగే రొటీన్ గా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. ఎప్పటిలాగే ప్రభుత్వ హమీలను చదివి వినిపించారని.. వాటి అమలు గురించి మాత్రం మాట్లాడలేదన్నారు. గతంలో కూడా హామీల గురించి సభలో చెప్పడం తప్ప.. ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. మేకిన్ ఇండియా, నిరుద్యోగ సమస్యలపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు.