ప్రపంచవ్యాప్తంగా రష్యాపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత

ప్రపంచవ్యాప్తంగా రష్యాపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత

ఉక్రెయిన్ పై దాడులతో విరుచుకుపడుతున్న రష్యాపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రష్యాకు వ్యతిరేకంగా పలు దేశాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. 

అమెరికాలో...
ఉక్రెయిన్లో రష్యా దాడులను అడ్డుకోవాలని.. అమెరికా వ్యాప్తంగా నిరసలు చేపట్టారు ఉక్రెయిన్లు, అమెరికన్లు. రష్యన్ ఎంబసీ ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతరం వైట్హౌస్ దగ్గరికి వందలాది మంది ర్యాలీగా వచ్చారు. పుతిన్ను అడ్డుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కోరారు. యుద్ధాన్ని ఆపాలని, ఉక్రెయిన్ ను రక్షించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో వందలాది మంది రోడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపాలని నినాదాలు చేశారు.

యూరప్లో...
యూరప్ కంట్రీల్లో రష్యాకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయేల్, బెర్లిన్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పుతిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉక్రెయిన్ జాతీయ జెండాలతో పాటు ‘కిల్లర్ పుతిన్’అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. 
ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా... ఉక్రెయిన్ లోని రష్యన్లు ఆందోళన చేపట్టారు. ఉక్రెయిన్ లోని రష్యా ఎంబసీ ఎదుట యుద్ధం ఆపాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్కు మద్ధతుగా తమ పాస్ పోర్టులను కాల్చి నిరసన తెలిపారు ఉక్రెయిన్ లోని రష్యన్లు.

రష్యాలో కూడా...
ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగడంపై రష్యాలో కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. పుతిన్ చర్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా రష్యా వ్యాప్తంగా ప్రజలు రోడ్లెక్కారు. ‘నో టు వార్ ’అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రష్యన్లు. యుధ్దానికి వ్యతిరేకమని అంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఉక్రెయిన్ ఆక్రమణను విరమించుకోవాలని.. వెంటనే సైన్యం తిరిగి రావాలని డిమాండ్ చేశారు రష్యన్లు. రష్యాలోని 59 పట్టణాల్లో సుమారు 17 వందల మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్క మాస్కోలోనే.. 9 వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో 700 మంది నిరసన కారులను జైలుకు పంపారు.

For More News..

ఉక్రెయిన్‎లో ఓ తండ్రి వ్యథ.. కన్నీళ్లు పెట్టించే వీడియో..

‘భీమ్లానాయక్’ కారణంగా మరో వాయిదా