ఉద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు

ఉద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు
  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నారాయణపేట: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఉద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబెట్టారు.. దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు మన రాష్ట్రంలో అమలవుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆయన విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు లక్ష 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే 20 కోట్ల జనాభా ఉన్న యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఉన్నది పేగు బంధం,  కాబట్టి ఉద్యోగులను వదులుకోమని,  ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి ఉద్యోగులు మోసపోవద్దని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. కరోనా వల్లనో లేదా మరేదో కారణం వల్ల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాస్త ఆలస్యమయ్యిందని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్

వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప.. క్యాచ్ అందుకున్న డెలివరీ బాయ్

ఆనంద్ మహీంద్రా ట్వీట్: ఇది ఎలిఫెంట్ కాదు.. ఎలీ-ప్యాంట్