రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా

రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా కొట్టాయి. 14 ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. రాజ్యాంగ దినోత్సవ వేడుకను బహిష్కరించాలని కాంగ్రెస్ ఇచ్చిన పిలుపునకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. వీటిలో డీఎంకే, శివసేన, ఆర్ఎస్పీ, ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీతోపాటు సీపీఎం, సీపీఐ(ఎం), ఆర్జేడీ, జేఎంఎం, ఐయూఎంఎల్​ పార్టీలు ఉన్నాయి. గురువారం ప్రతిపక్ష పార్టీలు కలసి ప్రత్యేక మీటింగ్ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఈ శీతాకాల సమావేశాల్లో విపక్షాలన్నీ ఏకతాటిపై ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ.. మోడీ సర్కార్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండాలని నిర్ణయించామని, రాజ్యాంగ దినోత్సవ వేడుకులకు తమ పార్టీ ఎంపీలు హాజరు కాలేదని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు.