- నిందితులను ఎన్ కౌంటర్ చేయాలి డిమాండ్
- అప్పటి వరకు అంత్యక్రియలు చేయమన్నమృతుని తండ్రి
- ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఘటన
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఓ కాలేజీ వద్ద స్టూడెంట్ ను కాల్చిచంపిన ఘటన స్థాని కంగా కలకలం రేపింది. వారణాసిలోని ఓ కాలేజీలో సదరు స్టూడెంట్ కాలేజీకు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగలు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు. దీంతో ఆ విద్యా ర్థి అక్కడిక్కడే మరణించాడు.
విషయం తెలుసుకున్న మృతుడు కుటుంబ సభ్యుల కాలేజీ చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. అయితే నిందితులను పట్టుకుని ఎన్ కౌంటర్ చేస్తేనే తన కుమారుడి మృతదేహానికి అత్యక్రియలు చేస్తా మని పట్టుబట్టాడు. బాధితుడి కుటుంబానికి మద్దతుగా స్థానికులు, తోటి విద్యార్థులు భారీగా తరలిరావడంతో కాలేజీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
