
హైదరాబాద్ కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర ప్రైవేటు బస్సు దగ్ధమైంది. బాలానగర్ నుండి కూకట్ పల్లి వై జంక్షన్ వైపు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్ చెందిన బస్సులో ఒకసారిగా మంటలు అంటుకున్నాయి. బస్సు ఇంజన్ నుండి భారీ శబ్దంతో మంటలు రావడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. కూకట్ పల్లి వై జంక్షన్ సమీపంలోని హెచ్. పి పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో పూర్తి గా బస్సు దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళన తో చుట్టూ ఉన్న వాహనదారులు ..వాహనాలు ఆపేసి పరుగులు తీశారు. ప్రమాదం కారణంగా బాలానగర్ నుండి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు.