జీఎస్టీ ఎగవేత కేసులపై డీజీజీఐ చర్యలను ముమ్మరం చేసింది. జీఎస్టీని వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించని ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆరెంజ్ ట్రావెల్స్ తో పాటు మరో ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ఎండీ చేతన్ ను అరెస్ట్ చేసింది జీఎస్టీ ఇంటిలిజెన్స్ బృందం.
ప్రజల నుంచి వసూలు జీఎస్టీ వసూలు చేసినా ఆరెంజ్ ట్రావెల్స్ ..రూ. 28.24 కోట్ల జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ట్రిలియన్ లీడ్ రూ.22 కోట్ల వరకు పన్నలు ఎగ్గొట్టింది. ఆరెంజ్ ట్రావెల్స్, ట్రిలియన్ లీడ్ నిర్ధిష్ట గడువు ముగిసినా మూడు నెలలైనా ఇంకా జీఎస్టీ కట్టలేదు.
ఈ క్రమంలోనే ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ కుమార్, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చేతన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీజిఎస్టి చట్టం 2017 నిబంధన కింద సునీల్ కుమార్, శ్రీ చేతన్ లను అరెస్ట్ చేశారు పోలీసులు.
