హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత జెట్టి కుసుమ కుమార్ ను ఒడిశా ఏఐసీసీ కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి కుసుమ కుమార్ చేసిన కృషిని గుర్తించి హైకమాండ్ ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒడిశాలో కూడా కాంగ్రెస్ బలోపేతానికి కుసుమ కుమార్ కృషి చేస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో కుసుమ కుమార్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశారు.
