హైదరాబాద్లోఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో మోసం..బెంబేలెత్తిపోతున్న ప్రజలు

హైదరాబాద్లోఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో మోసం..బెంబేలెత్తిపోతున్న ప్రజలు

 హైదరాబాద్: కూకట్ పల్లిలోఆర్గానిక్ ఉత్పత్తుల పేరిట మోసం చేస్తున్న ఓ కంపెనీ బండారం బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్గానిక్ ఉత్పత్తులు అంటూ నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు నిర్వాహకులు. చెన్నై కి చెందిన ఓ కంపెనీ నిర్వాహకులు సాధారణ కూరగాయలను ఆర్గానిక్ కూరగాయాలు అంటూ ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. సరైన ప్రమాణాలు పాటించకుండా నకిలీ ఆర్గానిక్ కూరగాయాలను ప్రజలకు అంటగడుతున్నారు నిర్వాహకులు. బాలానగర్ లో ఫ్యాక్టరీల మధ్య ఈ కంపెనీనీని నిర్వహిస్తున్నారు.

 కెమికల్ వ్యర్థాల మధ్య కంపెనీ రన్ చేస్తూ ఆర్గానిక్ ఉత్పత్తులంటూ.. వినియోగదారులకు మందులు వేసి పండించిన కూరగాయలను అమ్ముతున్నారు. కంపెనీ నిర్వహణకు సంబంధించిన ధృవపత్రాలను అడగగా పొంతనలేని సమాధానం చెబుతున్నారు నిర్వాహకులు.ఇప్పటికే చెన్నైలో నిర్వహిస్తున్న ఈ సంస్థపై కేసు నమోదు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ లో కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆర్గానిక్ ఉత్పత్తుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి కంపెనీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.