
- నేటి నుంచి గురువారం వరకు స్పెషల్క్లాసులు
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ పరీక్షపై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు స్పెషల్ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్టు టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. పరీక్ష రాసే పద్ధతులపై వివిధ సబ్జెక్టుల వారీగా సోమవారం నుంచి ఈ నెల 11 వరకు అవగాహన క్లాసులను నిర్వహిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిపుణ చానెల్ లో అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తామన్నారు.
సోమవారం ఇంగ్లీష్, మంగళవారం సైన్స్, బుధవారం మ్యాథ్స్, గురువారం తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టులపై లైవ్ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయని చెప్పారు. ఇప్పటికే ఫిబ్రవరి నుంచి ఆరు నెలలుగా టెట్, డీఎస్సీపై స్పెషల్ లెసన్స్, క్రాష్ కోర్సు రూపంలో 320 గంటల పాటు కంటెంట్ ను ప్రసారం చేశామని ఆయన పేర్కొన్నారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పండిట్స్, పీఈటీ, స్పెషల్ కేటగిరీ టీచర్లకు ఉపయోగపడే విధంగా ప్రత్యక్ష ప్రసారాలుంటాయని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమం విద్య చానెల్ లో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పున: ప్రసారమవుతుందని వివరించారు.