రూ.100 కోట్లతో ఎంటీఆర్​ విస్తరణ

రూ.100 కోట్లతో ఎంటీఆర్​ విస్తరణ

హైదరాబాద్​, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో  విస్తరణ కోసం గత మూడు సంవత్సరాలలో రూ.100 కోట్లు ఇన్వెస్ట్​ చేశామని మసాలాలు, ఇన్​స్టంట్​ఫుడ్స్​తయారీ కంపెనీ ఎంటీఆర్ ప్రకటించింది.  భారతదేశంలో ఎంటీఆర్ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ సీఈఓ​ సునయ్ భాసిన్ మాట్లాడుతూ తమకు గుంటూరులో ప్లాంటు, హైదరాబాద్​లో ఔట్​సోర్సింగ్​ కేంద్రం ఉందన్నారు.

రూ.15 కోట్ల పెట్టుబడితో గుంటూరు ప్లాంటును విస్తరిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 1.5 లక్షల దుకాణాల్లో తమ వస్తువులు దొరుకుతాయని సునయ్​ చెప్పారు.